T20 World Cup 2026 : రెండేళ్ల క్రితం బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టిన భారత్ స్వదేశంలో ట్రోఫీపై కన్నేసింది. ట్రోఫీని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న సూర్యకుమార్ సేన ఇప్పటికే న్యూజిలాండ్(Newzealand)తో సిరీస్‌లో అదరగొడుతోంది. వరల్డ్‌కప్ సన్నద్ధతలో భాగంగా కివీస్‌తో సిరీస్ ముగియగానే విశ్రాంతి తీసుకోకుండా వామప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. గత సీజన్ ఫైనల్లో తలపడిన దక్షిణాఫ్రికా(South Africa)తోనే ప్రాక్టీస్ మ్యాచ్‌తో మెగా టోర్నీలో అడుగుపెట్టనుంది.
స్వదేశంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మొదయల్యే పొట్టి ప్రపంచకప్ కోసం భారత జట్టు పక్కాగా సిద్ధమవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా.. సొంతగడ్డపై ఐదుమ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వణికిస్తోంది. ఫిబ్రవరి1న సిరీస్ ముగియడమే ఆలస్యం.. ఫిబ్రవరి 3న ముంబై చేరుకోనుంది సూర్యకుమార్ సేన. మరసటి రోజే అక్కడి డీవై పాటిల్ మైదానంలో సఫారీలతో వామప్ మ్యాచ్ ఆడనుంది.
India are expected to play a warm-up game against South Africa before start of #T20WorldCup2026 #T20WorldCup
Read:https://t.co/V0wLfmbDzM— THE WEEK (@TheWeekLive) January 25, 2026
క్రిక్‌బజ్ కథనం ప్రకారం బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా వామప్ మ్యాచ్ ఉంటుందని అంగీకరించాయి. అయితే.. ఐసీసీ ఇంకా వామప్ మ్యాచ్‌లన్ని షెడ్యూల్ విడుదల చేయనందున అధికారిక ప్రకటన చేయడానికి నిరాకరించాయి. రెండేళ్ల క్రితం ఫైనల్లో ఏడు పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. వరల్డ్‌కప్‌లో గ్రూప్ ఏలోని భారత్ ఫిబ్రవరి 7న అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో లీగ్ దశలో తలపడనుంది. ఇక గ్రూప్ డీలోని దక్షిణాఫ్రికా ఫిబ్రవరి 9న కెనడాను ఢీకొట్టనుంది.