ముంబై : టెస్టులలో భారత క్రికెట్ జట్టును నడిపించే కొత్త నాయకుడెవరో ఈనెల 24న తేలనుంది. రోహిత్‌శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టెస్టులకు కొత్త సారథిని రాబోయే శనివారం ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది.
కెప్టెన్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టునూ అదే రోజు ప్రకటించనున్నట్టు సమాచారం. టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముంబైలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.