Ankita Raina : భారత నంబర్ 1 మహిళల టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా(Ankita Raina) పెండ్లి పీటలు ఎక్కింది. బాయ్‌ఫ్రెండ్ మిలింద్ శర్మ(Milind Sharma)ను వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో అంకిత, మిలింద్ పెండ్లి వైభవంగా జరిగింది. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను అంకిత సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
‘ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టమే మా ఇద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. జంటగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ఈ సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అని అంకిత రాసుకొచ్చింది. పెండ్లి వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న అంకిత, మిలింద్‌లను అభినందిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొత్త ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
Only love and gratitude to everything that brought us here!
Seeking your blessings as we begin our new journey together. pic.twitter.com/wKIbCRk9O9
— Ankita Raina (@ankita_champ) December 21, 2023
అంకిత రైనా 2018 నుంచి టెన్సిస్ ఆడుతోంది. గత కొంతకాలంగా మహిళల సింగిల్స్, డబుల్స్‌లో ఆమె నిలకడగా రాణిస్తోంది. అంకిత డబ్ల్యూటీఏ టూర్లో ఒక టైటిల్, డబ్ల్యూటీఏ 125 టోర్నమెంట్లో ఒక ట్రోఫీ గెలిచింది. ఇక అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్వహించిన పోటీల్లో సత్తా చాటిన అంకిత.. సింగిల్స్‌లో 11, డబుల్స్‌లో 25 ట్రోఫీలు గెలుపొందింది.