హిసార్(తజకిస్థాన్): సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్‌కు చుక్కెదురైంది. సోమవారం జరిగిన గ్రూపు-బీ పోరులో భారత్ 0-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇరాన్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ మొదలైన తొలి గంట పాటు ఇరాన్‌ను అద్భుతంగా నిలువరించింది. అయితే మ్యాచ్ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా టీమ్ఇండియా పట్టు విడించింది.
అప్పటి వరకు పటిష్టమైన డిఫెన్స్‌తో ఇరాన్‌ను ఇబ్బంది పెట్టిన భారత్ ఆఖర్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. ఇరాన్ తరఫున హుస్సేన్జాదె(60ని), అలీ(89ని), మెహదీ తరెమి(90+ని) గోల్స్ చేశౠరు. భారత్ తమ ఆఖరి లీగ్ పోరులో ఈనెల 4న అఫ్గానిస్థాన్‌తో తలపడుతుంది.