IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 144 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు ఇద్దరు కలిసి 69 పరుగులు చేశారు. వరుస ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులెత్తించిన రోహిత్ శర్మ భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు.
36 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయం 41 పరుగులు చేసిన రోహిత్.. తక్సిన్ బౌలింగ్‌లో రషిద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ.. గిల్‌తో కలిసి ఆచితూడి ఆడాడు. 38 బంతుల్లో 22 పరుగులు చేసిన విరాట్ రషిద్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండ్ అక్షర్ పటేల్ సైతం 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (62), కేఎల్ రాహుల్ (3) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 98 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉంది.
భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 69 బంతుల్లో వన్డే కెరీర్లో 16వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం గిల్ ఆరు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ సహాయంతో 66 పరుగులు చేశాడు.