Sultan Of Johor Cup : ప్రతిష్ఠాత్మక సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్‌లో భారత జూనియర్ హాకీ జట్టు కాంస్యంతో గర్జించింది. ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ (Newzealand)ను ఓడించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు సమం కాగా షూటౌట్ నిర్వహించారు. అందులో 3-2తో సత్తా చాటిన టీమిండియా కంచు మోత మోగించింది. దాంతో, పుణే టెస్టులో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమితో దిగాలు చెందిన అభిమానులు హాకీ వీరుల విజయంతో కొంత ఊరట చెందుతున్నారు.
మలేషియాను ఓడించి కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన భారత జట్టకు న్యూజిలాండ్ గట్టి పోటీనిచ్చింది. ఆట మొదలైన 11వ నిమిషంలోనే గుర్జొత్ సింగ్ తొలి గోల్ కొట్టాడు. ఆ తర్వాత మన్మ్మీత్ సింగ్ 20వ నిమిషంలో గోల్ చేయగా.. కివీస్ తరఫున ఆఖరి అర్థభాగంలో బ్రైన్(51), జాంటీ ఎల్మెస్(57)లు గోల్ సాధించారు. దాంతో, నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు తలా రెండేసి పాయింట్లు (2-)2 స్కోర్ చేశాయి.
After a fiercely contested match against New Zealand that ended in a draw, India triumphed in a thrilling penalty shootout to secure the bronze medal🥉
Today’s Goal Scores 🏑
Dilraj singh & Manmeet Singh#IndiaKaGame #HockeyIndia #SultanOfJoharCup #JrMensTeam
.
.
.@CMO_Odisha… pic.twitter.com/NGVOEsg7kv— Hockey India (@TheHockeyIndia) October 26, 2024
దాంతో, విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించారు. టీమిండియా తరఫున గుర్జొత్ సింగ్, మన్మ్మీత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుశ్వహలు పెనాల్టీలను గోల్‌గా మలిచారు. ప్రత్యర్థి ఆటగాళ్ల గోల్ ప్రయత్నాలను భారత గోల్ కీపర్ బిక్రమ్‌జిత్ సింగ్ సమర్ధంగా అడ్డుకున్నాడు. అతడు మూడు గోల్స్‌ను నిలువరించడంతో కివీస్ 3-2తో పరాజయం పాలైంది. టీమిండియా కాంస్యం గెలుపొందడంలో కోచ్ పీఆర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం వీడ్కోలు పలికిన శ్రీజేష్ భారత జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.