తింఫు : సాఫ్ అండర్-17 మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ దుమ్మురేపింది. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 7-0తో నేపాల్‌ను చిత్తుగా ఓడించింది.
ఆది నుంచే తమ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్‌లో టీమ్ఇండియా తరఫున నీరాచాను లాంగ్జమ్(25ని, 56ని), అభిస్తా బాన్సెట్(16ని, 41ని), అనుశ్క కుమారి(37ని, 62ని), కెప్టెన్ జులన్ నాంగ్మైతమ్(45+ని) గోల్స్ చేశారు.