సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రాస్ టేలర్(11), బీజే వాట్లింగ్(1)లను షమీ పెవిలియన్ పంపాడు. మధ్యలో మరో స్పీడ్‌స్టర్ ఇషాంత్ శర్మ హెన్రీ నికోల్స్‌ను ఔట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. లంచ్ విరామ సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లకు 135 పరుగులు చేసింది.
కివీస్ ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. వర్షం కారణంగా మంగళవారం ఆట గంట ఆలస్యంగా ఆరంభమైంది. ఆట తొలి సెషన్లో వికెట్ తీసేందుకు టీమ్ఇండియా తీవ్రంగా శ్రమించింది. ఎట్టకేలకు షమీ, ఇషాంత్ విజృంభించడంతో కోహ్లీసేన పైచేయి సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్(19: 112 బంతుల్లో), గ్రాండ్‌హోమ్(0) క్రీజులో ఉన్నారు.
A crucial breakthrough for India as we approach lunch!
— ICC (@ICC) June 22, 2021
Ishant Sharma gets Henry Nicholls with a peach of a delivery from round the wicket.
🇳🇿 are 134/4#WTC21 Final | #INDvNZ | https://t.co/LVaCJMvNwM pic.twitter.com/VNtCdw5FcT