T20 World Cup Tickets : వచ్చే ఏడాది జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ టికెట్లు వచ్చేశాయి. నవంబర్ 25న పూర్తి షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. డిసెంబర్ 11న సాయంత్రం 6:45 నుంచి టికెట్లు అమ్మకాలను ప్రారంభించింది. అయితే.. కో-హోస్ట్ అయిన భారత గడ్డపై వరల్డ్ కప్ తొలి టికెట్లను అనుకున్న సమయం కంటే ముందుగానే విడుదల చేశారు. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ టాస్ పూర్తయ్యాక మైదానంలోనే ప్రపంచకప్ టికెట్లతో ఇరుజట్ల కెప్టెన్లు ఫొటోలు దిగారు.
పొట్టి ప్రపంచకప్ ఆరంభం రోజే భారత్, యూఎస్ఏతో తలపడనుంది. సో.. ఈ మ్యాచ్ టికెట్‌ను కామెంటేటర్ రవి శాస్త్రి, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి విడుదల చేశారు. ఇద్దరూ నవ్వలు చిందిస్తూ ఆ టికెట్‌తో ఫొటో దిగారు. సఫారీ లెజెండ్ డేల్ స్టెయిన్, మర్క్రమ్ సైతం తమ జట్టు తొలి పోరు టికెట్‌తో మురిసిపోయారు. దక్షిణాఫ్రికా, కెనడా మ్యాచ్ టికెట్‌తో వీరిద్దరూ కెమెరాకు పోజిచ్చారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 టోర్నీ ప్రారంభం కానుంది. ఇరుదేశాల్లోని ఎనిమిది నగారాల్లో ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
🚨 Icc ceo statement about 100 rs ticket price of T20 world cup 🚨
With tickets from only ₹100/LKR1000, we’re inviting millions to be an active participant in cricket’s global celebration. Affordability at the centre of our strategy .#IndVsSa pic.twitter.com/opGZadRcNR
— Dipankar (@DipankarRish) December 11, 2025
టీ20 వరల్డ్‌కప్ టికెట్ల కోసం https://tickets.cricketworldcup.com సైట్లోకి వెళ్లాలి. ఈ సైట్ అడ్రస్‌పై క్లిక్ చేస్తే నేరుగా ‘బుక్‌మైషో’ (Book My Show) ఓపెన్ అవుతుంది. అందులో ఈ బిగ్ ఈవెంట్ టికెట్లను కొనుక్కోవచ్చు. రూ.100 నుంచి మ్యాచ్ టికెట్ ధర షురూ కానున్నందున భారీగా అమ్ముడుపోతాయని ఐసీసీ భావిస్తోంది. అర్హత సాధించిన 20 జట్లను గ్రూప్‌లుగా విభించింది ఐసీసీ. ఒక్కదాంట్లో ఐదు చొప్పున నాలుగు గ్రూప్‌లను చేసింది. ఆతిథ్య దేశమైన టీమిండియా గ్రూప్‌లో పాకిస్థాన్ మాత్రమే పెద్ద జట్టు. కానీ, శ్రీలంక గ్రూప్‌లో ఆస్ట్రేలియా ఉండడంతో ఆ జట్టుకు కఠిన సవాల్ ఎదురవ్వనుంది. ఇక గ్రూప్ 3లో ఇంగ్లండ్, వెస్టిండీస్.. గ్రూప్ 4లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి టెస్టు క్రికెట్ ఆడే జట్లు ఉన్నాయి.
గ్రూప్ -1 : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.
గ్రూప్ -2 : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ -3 : ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ -4 : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, యూఏఈ, కెనడా.
The tickets for the ICC Men’s #T20WorldCup 2026 are now LIVE! 🥳
Cheer for #TeamIndia from the stands and grab your tickets now 👉 https://t.co/7bwtnrDDYD pic.twitter.com/wYjtN4cLVO
— BCCI (@BCCI) December 11, 2025