Shooting Championship | ఢిల్లీ: జర్మనీలోని హనోవర్ వేదికగా జరిగిన వరల్డ్ డెఫ్ (వినికిడి లోపం ఉన్నవారు) షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. ఈ టోర్నీలో 7 స్వర్ణా లు, 7 రజతాలు, 7 కాంస్యాలతో మొత్తంగా 21 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినట్టు భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ) తెలిపింది.
18 పతకాలతో ఉక్రెయిన్ రెండో స్థానంలో నిలిచింది. 15 క్రీడాంశాలలో పాల్గొన్న 13 మంది భారత షూటర్లు పతకాల మోత మోగించారు. పిస్టల్ షూటర్ అభినవ్ దేశ్వాల్ ఒక స్వర్ణం, నాలుగు రజతాలతో అత్యధిక పతకాలు సాధించిన షూటర్‌గా నిలిచాడు.