ముంబై: మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్ఎమ్ఏ)లో భారత ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే పూజ తోమర్ అద్భుత విజయాలతో దూసుకెళుతుండగా, తాజాగా సంగ్రామ్ సింగ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఎమ్ఎమ్ఏలో ఆడబోతున్న తొలి భారత రెజ్లర్‌గా సంగ్రామ్ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.
కామన్వెల్త్ హెవీ వెయిట్ మాజీ చాంపియన్ అయిన సంగ్రామ్..ఎమ్ఎమ్లో ఆడేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నని పేర్కొన్నారు. భారత్‌లో ఎమ్ఎమ్ఏకు ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో తనకు మరింత మద్దతు లభిస్తుందని సింగ్ చెప్పుకొచ్చాడు.