Rohit Sharma | పెర్త్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లనున్నాడు. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొదలవుతుండగా, ఆదివారం టీమ్ఇండియాతో రోహిత్ కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
తన భార్య రితికా సజ్దే ఈ మధ్యే బాబుకు జన్మనిచ్చిన నేపథ్యంలో రోహిత్.. స్వదేశంలోనే ఉండిపోయాడు. రోహిత్ గైర్హాజరీలో పెర్త్ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గురువారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్‌తో కలిసి బుమ్రా పాల్గొన్నాడు.