షాహ్ ఆలమ్ (మలేషియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. సీనియర్ల గైర్హాజరీలో యువ షట్లర్లతో బరిలోకి దిగిన పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు చేరడంలో విఫలమయ్యాయి. గ్రూప్-‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్లో భారత పురుషుల జట్టు 2-3తో మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేషియా చేతిలో ఓటమి పాలవగా.. మహిళల బృందం 1-4తో జపాన్ చేతిలో ఖంగుతింది. పురుషుల విభాగంలో స్టార్ షట్లర్ లక్ష్యసేన్, మిథున్ విజయాలు సాధించగా.. కిరణ్తో పాటు రెండు డబుల్స్ జోడీలు పరాజయం వైపు నిలిచాయి. మహిళల విభాగంలో సింగిల్స్ ప్లేయర్ అశ్మిత చలిహ ఒక్కతే గెలుపొందగా.. ఆకర్శి, తారతో పాటు డుబల్స్ జోడీలు ప్రభావం చూపలేకపోయాయి.