జొహార్ (మలేషియా): సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ హాకీ టోర్నీలో భారత జట్టు బుధవారం బలీయమైన ఆస్ట్రేలియాను 5-5 స్కోరుతో నిలువరించింది. ఈ ఫలితంతో భారత జట్టు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో రెండో స్థానంలో కొనసాగుతున్నది.
చివరి క్షణంలో చేసిన గోల్‌తో భారత జట్టు గట్టెక్కింది. భారత జట్టులో అమన్‌దీప్ 60వ నిమిషంలో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు.