IND vs PAK | షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు.. వీడియో..!
IND vs PAK : భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల దౌత్య సంబంధాలే కాదు క్రీడా సంబంధాలూ దెబ్బతిన్నాయి. అందుకే అసియా కప్‌లో, మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ చేయలేదు మనోళ్లు.
IND vs PAK : భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల దౌత్య సంబంధాలే కాదు క్రీడా సంబంధాలూ దెబ్బతిన్నాయి. అందుకే అసియా కప్‌లో, మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ చేయలేదు మనోళ్లు. అయితే.. హాకీ ఆటగాళ్లు మాత్రం దాయాది టీమ్ సభ్యులతో కరచాలనం, హై ఫైవ్‌తో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అంధుల క్రికెట్ జట్టు మాత్రం పాక్‌తో హ్యాండ్ షేక్ చేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇరుదేశాల ప్లేయర్లు హ్యాండ్ షేక్‌తో వైరలయ్యారు.
శ్రీలంక ఆతిథ్యమిస్తున్న అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. కటునాయకే స్టేడియంలో నవంబర్ 16న ఇరుజట్ల క్రికెటర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. 20 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట పాక్‌ను 135/8కే కట్టడి చేసింది భారత్. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 10.2ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ దీపిక టీ.సీ 21 బంతుల్లో 45 పరుగులతో చెలరేగగా.. అనేఖా దేవీ (64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకమైంది.
Women Blind Cricket World Cup Colombo:.India women Blind won against Pakistan
Good to see Blind teams Hand shake. pic.twitter.com/jpjfM0XxFW— Sohail Imran (@sohailimrangeo) November 16, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

