కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. టీమ్ఇండియా లెఫ్టార్మ్ పేసర్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీ.నటరాజన్ కొవిడ్ టీకా తొలి డోసు వేసుకున్నాడు. టీకా వేసుకుంటుండగా తీసిన ఫొటోను తమిళనాడు పేసర్ నటరాజన్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌ను అర్ధంతరంగా వాయిదా వేయడానికి ముందే మోకాలి గాయం కారణంగా నటరాజన్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఏప్రిల్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్న అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇప్పటికే పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మ, బ్యాట్స్‌మెన్ పుజారా, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ తదితరులు టీకా మొదటి డోసు వేయించుకున్నారు.
Am so grateful to get my #Vaccine this morning. A million thanks to our incredible health care workers who have put themselves at risk for our people . #LetsGetVaccinated #Jabbed pic.twitter.com/v21Ez3dJGV
— Natarajan (@Natarajan_91) May 27, 2021