ODI World Cup : స్వదేశంలో వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. మరో ఐదు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుందనగా పేసర్ అరుంధతీ రెడ్డి (Arundhati Reddy) గాయపడింది. ఇంగ్లండ్‌తో మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా బంతి ఈ పేస్ గన్ మోకాలికి గట్టిగా తాకింది. దాంతో నొప్పితో విలవిలలాడిన అరుంధతి ఆ తర్వాత బౌలింగ్ చేయలేకపోయింది. ఆమెను చక్రాల కుర్చీ మీద కూర్చోబెట్టి తీసుకెళ్లారు ఫిజియో. దాంతో.. ప్రపంచ కప్‌లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
వరల్డ్ కప్ సన్నద్ధతలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలోని టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అరుంధతి రెడ్డి వేసిన13వ ఓవర్లో హీథర్ నైట్ (Heather Knight) కొట్టిన బంతి వేగంగా వచ్చి ఆమె ఎడమ మోకాలికి తగిలింది. నొప్పిని తట్టుకోలేకపోయిన అరుంధతి పిచ్ మీదే కూలబడింది. దాంతో.. ఫీజియో వచ్చి పరిక్షించినా ఆమె కోలుకోలేదు. నడవడానికి తీవ్రంగా ఇబ్బందిపడిన ఆమెను చక్రాల కుర్చీ మీద కూర్చొబెట్టి తీసుకెళ్లారు. జెమీమా చివరి రెండు బంతులు వేసి ఓవర్ పూర్తి చేసింది.
Arundhati Reddy injured in the warm-up game against England. ☹️
Bad news from the Indian camp just 4 days before the World Cup.#CricketTwitter pic.twitter.com/u80vBKUPr3
— Female Cricket (@imfemalecricket) September 25, 2025
అయితే.. అరుంధతి గాయం తీవ్రతపై వైద్య పరీక్షల తర్వాత స్పష్టత రానుంది. వరల్డ్ కప్ ప్రారంభమయ్యే నాటికి ఆమె కోలకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే వికెట్ కీపర్ యస్తికా భాటియా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ సెప్టెంబర్ 30న మొదలవ్వనుంది. తొలి పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియా.. చమరి ఆటపట్టు సారథ్యంలోని లంకతో తలపడనుంది.
A power packed #TeamIndia squad for the ICC Women’s Cricket World Cup 2025 💪
Harmanpreet Kaur to lead the 15 member squad 🙌🙌#WomenInBlue | #CWC25 pic.twitter.com/WPXA3AoKOR
— BCCI Women (@BCCIWomen) August 19, 2025
వరల్డ్ కప్ స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్.
స్టాండ్ బై : తేజల్ హస్నబిస్, ప్రేమా రావల్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రీ, మిన్ను మణి, సయాలీ సథ్ఘారే