IND vs WI: వెస్టిండీస్ 390 ఆలౌట్.. ఇండియా టార్గెట్ 121
IND vs WI: రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 390 రన్స్‌కు ఆలౌటైన వెస్టిండీస్.. ఇండియాకు 121 రన్స్ టార్గెట్ విసిరింది. బుమ్రా, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇవాళ నాలుగో రోజు కావడంతో.. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ : ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు(IND vs WI) రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 390 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇండియాకు 121 రన్స్ టార్గెట్ విసిరారు. విండీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు భారత బౌలర్లను ఇవాళ పరీక్షించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడిన విండీస్ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. రెండో ఇన్నింగ్స్‌లో 120 రన్స్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసే ఆలోచనల్లో భారత్ ఉన్నది.
విండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సాయ్ హోప్ సెంచరీ కొట్టాడు. అయితే మిడిల్ ఆర్డర్లో విండీస్ ఇబ్బందిపడింది. సీల్స్, గ్రీవ్స్ చివరి వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఆ ఇద్దరూ 79 రన్స్ జోడించారు.
భారత్‌కు ఇవాళ 18 ఓవర్లు ఆడే అవకాశం ఉన్నది. ఒకవేళ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తే, అప్పుడు మ్యాచ్‌ను 5.30 నిమిషాల తర్వాత కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక జడేజా, సుందర్ ఖాతాలోకి ఒక్కొక్క వికెట్ వెళ్లింది. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 518 రన్స్ చేయగా, విండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 248, రెండో ఇన్నింగ్స్‌లో 390 రన్స్ చేసింది.
𝐈𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐁𝐫𝐞𝐚𝐤!
Jasprit Bumrah wraps up the innings with his 3⃣rd wicket ☝️#TeamIndia need 1⃣2⃣1⃣ runs to win the match and the series 👍
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/N0Z0vsZwkL
— BCCI (@BCCI) October 13, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

