Team India : ఆసియా కప్‌ను అజేయంగా ముగించిన భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తడబడుతోంది. వన్డే సిరీస్ పోతేపోయింది కనీసం పొట్టి కప్‌ను అయినా పట్టేస్తుందనుకుంటే ఓటమితో సిరీస్‌ను మొదలెట్టింది. మెల్బోర్న్లో పరాజయానికి కారణాలు ఏంటో లోతుగా అన్వేషించాల్సిన పనిలేదు. తుది జట్టును గమనిస్తే సగటు అభిమానికి కూడా సమస్య ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. మ్యాచ్ విన్నర్లు అయిన యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)లను బెంచ్‌మీద ఉంచడమే భారత్ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఫార్మాట్లో హిట్టైన ఆటగాళ్లను వది లేసి.. ప్రయోగాలకు తెరతీసిన కోచ్ గౌతం గంభీర్ కూడా ఓ రకంగా బాధ్యుడేనని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.
టీ20ల్లో అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు జోడీగా శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా కొనసాగించడంపై మాజీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్‌లోనూ అతడు పెద్దగా రాణించిందిలేదు. ఇప్పుడు ఆసీస్ పర్యటనలోనూ గిల్ నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం అతడి సగటు 24.14కు పడిపోయింది. శుభారంభం లభించినా పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నాడీ వన్డే కెప్టెన్. గత పది మ్యాచుల్లో గిల్ ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించాడు.
మిగతా తొమ్మిదింట అతడు 3, 7, 6, 9, 0, 8, 23, 31, 2 పరుగులకే పరిమితం అయ్యాడు. దాంతో.. ఫామ్‌లో లేని గిల్‌ను తప్పించి ఇప్పటికే పొట్టి ఫార్మాట్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వీ జైస్వాల్‌ను ఆడించాలని పలువురు సూచిస్తున్నారు. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Irfan Pathan said Shubman Gill needs to start scoring consistently in T20Is, as he is making Yashasvi Jaiswal wait on the bench for his chance.#ShubmanGill #YashasviJaiswal #AUSvIND #CricketTwitter pic.twitter.com/VYmLSLR5MZ
— InsideSport (@InsideSportIND) November 1, 2025
ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌కే పరిమితమన యశస్వీ జైస్వాల్ టీ20ల్లోనూ దంచికొట్టగల సమర్ధుడు. ఐపీఎల్లో అతడి ట్రాక్ రికార్డు అమోఘమని ఇర్ఫాన్ అంటున్నాడు. ‘యశస్వీ అద్భుతమైన క్రికెటర్. ఐపీఎల్లో అతడు 160 స్ట్రయిక్ రేటుతో ఆడడం చూశాం. అలాంటి విధ్వంసక ఆటగాడిని బెంచ్ మీద కూర్చోబెట్టడం.. వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశాలివ్వడం సరికాదు. ఇకనైనా గిల్ బ్యాటుతో చెలరేగి శుభారంభాలు ఇవ్వాలి. లేదంటే యశస్వీని ఓపెనర్‌గా ఆడించడం మంచింది. ఎందుకంటే.. ప్రతిభావంతుడైన అతడు వన్డేల్లో డబుల్ సెంచరీ చేయగల సమర్ధుడు. కానీ, టీ20ల్లో టీమిండియా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అతడు జట్టులో లేకపోవడం’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.
After seeing Shubman Gill’s performance in T20I, I’m literally feeling bad for Yashasvi Jaiswal 😶🌫️ pic.twitter.com/F0RzHswfQM
— Richard Kettleborough (@RichKettle07) October 31, 2025
లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం పెద్ద పొరపాటని నిరూపితమైంది. టీ20ల్లో అత్యధిక వికెట్లు (101) తీసిన భారత బౌలర్ అయిన అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలానే బ్యాటింగ్ ఆర్డర్లో శివం దూబేని కాదని హర్షిత్ రానాను ముందు పంపడం.. సత్ఫలితాన్నే ఇచ్చినా దూబే మాత్రం నిరాశపరిచాడు. సిరీస్ సమం చేయాలంటే మూడో వన్డేలో సూర్యకుమార్ సేన కచ్చితంగా గెలుపొందాలి. పేస్, బౌన్సీ పిచ్‌ల మీద చెలరేగిపోయే అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవడంతో పాటు యశస్వీకి ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. మొండిగా వ్యవహరించే గౌతీ, కెప్టెన్ సూర్యలు తుది జట్టులోకి ఎవరెవరిని తీసుకుంటారో చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మూడో టీ20 నవంబర్ 2న జరుగనుంది.
What are your thoughts on Arshdeep Singh missing out on the first two T20Is against Australia? 🤔#AUSvIND #MCG #ArshdeepSingh #Sportskeeda pic.twitter.com/T02LtgBTeA
— Sportskeeda (@Sportskeeda) October 31, 2025