చెన్నై: ఏఎఫ్సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాకౌట్ చేరిన భారత యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల పోరాటం క్వార్టర్ఫైనల్లోనే ముగిసింది. సోమవారం జరిగిన క్వార్టర్స్ పోరులో భారత్ 0-3 చైనా చేతిలో తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఈ ఏడాది మొరాకోలో జరగనున్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధించే సువర్ణావకాశాన్ని భారత్ కోల్పోయింది.
సొంత గడ్డపై ఆడుతున్న చైనా మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. హువాంగ్ క్విన్యి, ల్యూ యుక్సీ, లీ కిక్సియన్ తలో గోల్‌తో చైనాను సెమీస్ చేర్చారు.