IND vs SA : పొట్టి సిరీస్లో చెరొక మ్యాచ్ గెలుపొందని భారత్, దక్షిణాఫ్రికా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ధర్మశాలలో విజయంతో సిరీస్లో ముందంజ వేయాలనే కసితో ఉన్నాయి ఇరుజట్లు. టాస్ గెలుపొందిన సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బౌలింగ్ తీసుకున్నాడు. రెండో మ్యాచ్లో ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా.. గెలుపే లక్ష్యంగా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మరోవైపు సఫారీ జట్టు సైతం మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.
తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపని జస్ప్రీత్ బుమ్రా ధర్మశాలలో ఆడడం లేదు. అలానే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం దూరం కావడంతో వీరిద్దరి స్థానంలో హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. ముల్లన్పూర్లో అదిరే ఆటతో సిరీస్ సమం చేసిన దక్షిణాఫ్రికా స్టబ్స్, కార్బిన్ బాష్, నోర్జిలను ఆడిస్తోంది. రెండో మ్యాచ్లో విజయంతో సఫారీ టీమ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలంటే రెండు మ్యాచుల్లో విఫలమైన కెప్టెన్ సూర్య, వైస్ కెప్టెన్ గిల్ ఈసారి బ్యాట్ ఝులిపించాలి.
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), హర్షిత్ రానా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెన్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, స్టబ్స్, డొనొవన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్జి, లుంగి ఎంగిడి, బార్ట్మన్.