INDW vs AUSW : సొంత గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో కంగారూలను చిత్తుగా ఓడించిన భారత జట్టు వన్డే సిరీస్(ODI Series)పై నజర్ వేసింది. ముంబైలో జరుగుతున్న తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న రీచా ఘోష్(21)ను సథర్లాండ్ వెనక్కి పంపింది. దాంతో, భారత్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(3), యస్తికా భాటియా(18)క్రీజులో ఉన్నారు.
Smriti Mandhana isn’t playing today; Saika Ishaque makes her ODI debut 🧢
LIVE: https://t.co/a3EHOcBNlQ | #INDvAUS pic.twitter.com/exbaEqsy9p
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ తీసుకుంది. ఆదిలోనే టీమిండియాకు షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(1)ను డార్సీ బ్రౌన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత రీచా ఘోష్, యస్తికా భాటియా ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు.