Bomb Threat | ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
Bomb Threat | దేశంలో పలు విమానాశ్రయాలకు (Airports) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపింది.
Bomb Threat | దేశంలో పలు విమానాశ్రయాలకు (Airports) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపింది. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అమ్మదాబాద్ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బుధవారం రాత్రి 10:23 గంటల సమయంలో బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా, బుధవారం ముంబైలోని పలు బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు, ప్రముఖ మంత్రుల పాత్ర ఉన్నదని పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి రాజీనామా చేసి కుంభకోణంపై ప్రకటన చేయకుంటే ఒక దాని తర్వాత ఒకటి బాంబులు పేలుస్తామన్నారు. దీంతో పోలీసులు తనిఖీ దళాలతో సోదాలు చేశారు. అయితే ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలూ దొరకలేదు.
Also Read..
Canada | నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేయనున్న కెనడా పోలీసులు
MS Dhoni | ఇంత హెయిర్ మెయిన్‌టెయిన్ చేయడం అంత ఈజీ కాదు.. కానీ, ఫ్యాన్స్ కోసం.. : ధోనీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

