Canada | నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేయనున్న కెనడా పోలీసులు
Canada | కెనడా (Canada) లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థాన్ తీవ్రవాది హత్య కేసులో ఇద్దరు అనుమానితుల్ని (two suspects) కెనడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Canada | కెనడా (Canada) లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థాన్ తీవ్రవాది హత్య కేసులో ఇద్దరు అనుమానితుల్ని (two suspects) కెనడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ ఇద్దరినీ పోలీసులు అతి తర్వలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితులపై గత కొన్ని నెలలుగా కెనడా పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ హత్య తర్వాత వారు కెనడా విడిచి ఎక్కడికీ పారిపోలేదని.. కొన్ని వారాల్లోనే ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి.
భారత ప్రభుత్వం ‘వాంటెడ్ టెర్రరిస్ట్’ గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) ఈ ఏడాది జూన్ 18వ తేదీన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడా (Canada) లోని సర్రే (Surrey) లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హర్దీప్ మరణించాడు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ, నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ చేస్తుంటాడు. పలు భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న హర్దీప్ ను కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, నిజ్జర్ హత్య వెను భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ఆరోపిస్తోంది. ఈ మేరకు భారత్పై కెనడా (Canada ) ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే, కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Also Read..
Sharad Pawar | రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు : శరద్ పవార్
MS Dhoni | ఇంత హెయిర్ మెయిన్టెయిన్ చేయడం అంత ఈజీ కాదు.. కానీ, ఫ్యాన్స్ కోసం.. : ధోనీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

