World Cup Final : క్రీజులో పాతుకుపోయి దక్షిణాఫ్రికా బౌలర్లకు దడపుట్టించిన ఓపెనర్ షఫాలీ వర్మ(87) సుడిగాలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. బౌండరీలతో చెలరేగుతూ సెంచరీకి చేరువైన లేడీ సెహ్వాగ్ అనూహ్యంగా వెనుదిరిగింది. ఖాక ఓవర్లో మిడాన్‌లో షాట్ ఆడిన తను సునే లుస్కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో.. జెమీమా రోడ్రిగ్స్(24)తో ఆమె నెలకొల్పిన రెండో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
బిగ్ వికెట్ పడడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(4) క్రీజులోకి వచ్చింది. 30 ఓవర్లకు స్కోర్. ఓపెనర్లు రన్ రేటు 5.5 దాటకుండా చూసుకుంటూ స్కోర్‌బోర్డును నడిపించగా.. కొనసాగించాలనుకున్నారు. కానీ, ఖాక ఓవర్లో మిడాన్‌లో లారా వొల్వార్డ్త్ సూపర్ క్యాచ్ పట్టడంతో జెమీమా పెవిలియన్ చేరింది. దాంతో..171 వద్ద మూడో వికెట్ పడింది. ఐదు పరుగుల వ్యవధిలోనే ఇద్దరు ఔట్ కావడంతో దీప్తి శర్మతో కలిసి జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకుంది కెప్టెన్ కౌర్. 30 ఓవర్లకు స్కోర్.. 172-3.
I’ve said it before and I’ll keep saying it I will always pick Shafali Verma ahead of Pratika Rawal in my team. Shafali may not perform in every match, but the day she does, she will always make you win the match #INDvsSA pic.twitter.com/ZOKMUqTqFn https://t.co/OMgES7CYX1
— Aditya Soni (@imAdsoni) November 2, 2025