కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఔటయ్యారు. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. వాస్తవానికి మంచి స్టార్ట్ ఇచ్చిన ఓపెనర్లు.. భారీ స్కోర్లు చేయకుండానే వెనుదిరిగారు. కేఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ కోహ్లీ, పుజారాలు ఉన్నారు. ఇండియా 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 37 రన్స్ చేసింది.