న్యూ చండీఘడ్ : ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు(IND vs AFG) మ్యాచ్‌లో.. టీమిండియా జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్ ఔటయ్యాడు. 24 రన్స్ చేసిన అతను సలీం బౌలింగ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే 10 ఓవర్ల తర్వాత కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జియా ఉర్ రెహ్మాన్ బౌలింగ్ అతను క్యాచ్ ఇచ్చాడు. అఫ్సర్ జాజాయి క్యాచ్ అందుకున్నాడు. కానీ ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. థార్డ్ అంపైర్‌కు వెళ్లాలని గుర్బాజ్ చెప్పినా.. కెప్టెన్ షాహిదీ మాత్రం డీఆర్ఎస్ తీసుకోలేదు. కానీ అల్ట్రాఎడ్జ్‌లో బంతి రాహుల్ బ్యాట్‌కు తగిలినట్లు తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్ తప్పిదం వల్ల రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం 16 ఓవర్లలో ఇండియా వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది. రాహుల్ 22, సాయి సుదర్శన్ 8 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
ఇండియా తరపున స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేస్తున్నాడు. తుది జట్టులో రిషబ్ పంత్, ద్రువ్ జురెల్ కూడా చోటు సంపాదించారు. సాయి సుదర్శన్‌కు కూడా చోటు దక్కింది. అతను మూడవ స్థానంలో ఆడనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తరపున నాన్గెయాలియా ఖరేటో తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.