Asia cup 2023 : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఔటైన తర్వాతి ఓవర్లోనే శుభ్‌మన్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు) వెనుదిరిగాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో అఘా సల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, 124 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(2), కేఎల్ రాహుల్(1) ఆడుతున్నారు. 18 ఓవర్లు భారత్ స్కోర్.. 124/2.
17వ ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(56 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఔటయ్యాడు. షాదాబ్ ఖాన్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఫహీం అష్రఫ్ చేతికి చిక్కాడు. దాంతో, 121 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది.