అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి హాకీ టెస్టులో చివరి క్షణాల్లో పట్టు కోల్పోయిన ఇండియా 4-5 స్కోరుతో పరాజయం పాలైంది. ఆకాశ్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. భారత్‌కు ఆకాశ్‌దీప్ సింగ్ 10, 27, 59 నిమిషాల్లో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 31వ నిమిషంలో గోల్స్ చేశారు. ఆస్ట్రేలియా జట్టులో లాచ్లన్ షార్స్(5ని), నాథన్ ఎఫ్రామ్స్ (21ని), టామ్ క్రెయిగ్(41ని), బ్లేక్ గోవర్స్(57ని, 60ని) గోల్స్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.