IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. ముందుగా 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌ను అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడి ఆదుకున్నారు. భారీ పార్ట్నర్ షిప్‌తో జట్టు స్కోర్‌ను 150 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (42), శ్రేయాస్ అయ్యర్ (79) కొద్ది పరుగుల తేడాతో ఔట్ కావడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది.
అయ్యర్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్‌కు హార్దిక్ పాండ్యా జతచేరాడు. ఆ తర్వాత కాసేపటికే కేఎల్ రాహుల్ (23) ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ పాండ్యాకు జతగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు, కైల్ జామిసన్, విలియం ఓరూక్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసుకున్నారు. 40 ఓవర్ల ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు. క్రీజులో పాండ్యా (4), రవీంద్ర జడేజా (2) ఉన్నారు.