పుణె: పుణె టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. శుభమన్ గిల్ వ్యక్తిగతంగా 30 రన్స్ చేసి సాంట్నర్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిలువలేకపోయాడు. ఫుల్ టాస్ బంతిని స్వీప్ షాట్ ఆడబోయిన కోహ్లీ.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ కేవలం ఒక రన్ మాత్రమే చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 56 రన్స్ చేసింది. జైస్వాల్(25), పంత్ క్రీజ్లో ఉన్నారు.
2ND Test. WICKET! 23.4: Virat Kohli 1(9) b Mitchell Santner, India 56/3 https://t.co/3vf9Bwzgcd #INDvNZ @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 25, 2024