Hockey | పెర్త్: ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత హాకీ జట్టు వరుస ఓటముల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన రెండో పోరులో భారత్ 2-4 తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌తో పోల్చుకుంటే ఒకింత మెరుగ్గా ఆడిన టీమ్ఇండియా..ప్రత్యర్థికి తక్కువ గోల్స్ సమర్పించుకుంది. వాస్తవానికి తొలి అర్ధభాగం ముగిసే సరికి భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.
అయితే మిగిలిన రెండు క్వార్టర్లలో పేలవ డిఫెన్స్‌తో మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున జుగ్రాజ్సింగ్(9ని), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్(30ని) గోల్స్ చేయగా, జెరెమీ హేవర్డ్(6ని, 34ని), జాకబ్ అండర్సన్(42ని), నాథన్ ఎఫార్మస్(45ని) ఆసీస్‌కు గోల్స్ అందించారు. ఈ నెల 10న ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగనుంది.