India Junior Hockey Team : ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్(FIH Hockey World Cup 2025) సన్నద్ధతలో ఉన్న భారత మహిళల జూనియర్ హాకీ జట్టు యూరప్ పర్యటన(Europe Tour)ను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన పోరులో బలమైన బెల్జియం (Belgium)ను చిత్తుగా ఓడించింది. తద్వారా ఈ లీగ్‌లో గోల్ కీపర్ నిధి నేతృత్వంలోని టీమిండియా అదిరే బోణీ కొట్టింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసిన భారత అమ్మాయిలు జట్టుకు 3-2తో విక్టరీని అందించారు. జూన్ 10న మళ్లీ బెల్జియంతోనే భారత్ తలపడనుంది.
ఈమధ్యే నాలుగు దేశాల టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. పటిష్టమైన బెల్జియం డిఫెండర్ల కళ్లు గప్పుతూ.. తొలి అర్థ భాగంలోనే ఫార్వర్డ్ ప్లేయర్ గీతా యాదవ్ (Geetha Yadav) గోల్ చేసింది. 11 వ నిమిషంలో ఆమె చేసిన గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. 25వ నిమిషంలో ప్రత్యర్థి క్రీడాకారిణి మరీ గోయెన్స్ స్కోర్ సమం చేసింది. కాసేపటికే లూయిస్ వాన్ హెకే గోల్‌తో బెల్జియం జట్టు స్కోర్ 2-1కు చేరింది. అయినా సరే భారత క్రీడాకారిణులు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు.
Indian Junior Women’s Hockey Team edged past Belgium with a 3-2 victory in a thrilling encounter.
Geeta Yadav and Sonam found the net with field goals, while Lalthantluangi converted a penalty corner to secure the win.
Belgium responded with goals from Marie Goenns and Louise… pic.twitter.com/SFUa9aaoCh
— Hockey India (@TheHockeyIndia) June 8, 2025
సోనమ్ 40వ నిమిషంలో మెరుపు గోల్‌తో పోటీలోకి వచ్చిన టీమిండియా ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. 45వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపిన డిఫెండర్ లథన్ట్లుంగి(Lalthantluangi) భారత్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత బెల్జియం అమ్మాయిలు గోల్ కోసం చేసిన ప్రయత్నాలను మన ఢిఫెండర్లు తిప్పికొట్టారు. దాంతో, భారత్ తొలి పోరులోనే భారీ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది.