షార్జా: ప్రతిష్ఠాత్మక అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పై ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని యువ భారత్ 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 143 పరుగులు చేసింది.
ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(46 బంతుల్లో 76 నాటౌట్, 3ఫోర్లు, 6సిక్స్‌లు), ఆయూశ్ మాత్రె(51 బంతుల్లో 67 నాటౌట్, 4ఫోర్లు, 4సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ఐపీఎల్లో 1.10 కోట్ల ధర పలికిన 13 ఏండ్ల సూర్యవంశీ అంచనాలకు అనుగుణంగా సత్తాచాటాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన సూర్యవంశీ యూఏఈపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. రయాన్ (35), అక్షత్(26) రాణించగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఆయూశ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.