దుబాయ్: టీ20క్రికెట్లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ (మొత్తంగా మూడోసారి) గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ఐసీసీ వార్షిక టీ20 ర్యాంకింగ్స్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025 మే నుంచి జరిగిన మ్యాచ్ల వెయిటేజీని పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ ఈ ర్యాంకులను విడుదల చేసింది.
275 రేటింగ్ పాయింట్లతో మెన్ ఇన్ బ్లూ తొలి స్థానంలో ఉండగా ఇంగ్లండ్ (262), ఆస్ట్రేలియా (258), న్యూజిలాండ్ (247), సౌతాఫ్రికా (244) టాప్-5లో నిలిచాయి.