ఢిల్లీ: గత వారం రోజులుగా దేశ రాజధానిలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పదో స్థానంతో ముగించింది. పోటీల ఆఖరి రోజైన ఆదివారం భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. దీంతో మొత్తంగా 22 మెడల్స్(6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో పతకాల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
బ్రెజిల్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా చైనా, ఇరాన్, నెదర్లాండ్స్, పోలండ్ టాప్-5లో నిలిచాయి. ఆదివారం సిమ్రన్ శర్మ (మహిళల 200 మీటర్ల టీ12 క్యాటగిరీ) స్వర్ణం సాధించింది. ఈ టోర్నీలో ఆమెకు ఇది రెండో పతకం. ప్రీతిపల్ (మహిళల వంద మీటర్లు టీ35) రజతం నెగ్గింది. పురుషు జావెలిన్ త్రో (ఎఫ్41)లో నవ్‌దీప్ సిల్వర్ సాధించాడు.