సోచి(రష్యా) : ఏఎఫ్సీ అండర్-17 మహిళల ఏషియన్ కప్ సన్నాహాల్లో భాగంగా రష్యాతో జరిగిన పోరులో భారత్ ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో యువ భారత్ 0-3 తేడాతో రష్యా చేతిలో ఓడింది. తమ తొలి మ్యాచ్‌లో చైనాపై ఓడిన భారత్..రష్యాతో మ్యాచ్‌లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్‌లో రష్యా తరఫున వలెరియా మెన్యిలోవా(49ని, 52ని) డబుల్ గోల్స్‌తో ఆకట్టుకోగా, సోఫియా సువన్య(18ని) మరో గోల్ చేసింది. అయితే మ్యాచ్‌లో పుంజుకునేందుకు భారత్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇరు జట్ల మధ్య ఈనెల 17న మరో మ్యాచ్ జరుగనుంది.