INDW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుస ఓటములను గుడ్ బై చెబుతూ.. సెమీస్ బెర్తు దక్కించుకున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు రెఢీ అవుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం(DY Patil)లో ఆదివారం మధ్నాహ్నం బంగ్లాదేశ్‌తో తలపడనుంది టీమిండియా. ఇదే వేదికపై న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన అదే తరహాలో బంగ్లాను ఓడించాలని అనుకుంటోంది. సెమీస్‌లో కఠినమైన ఆస్ట్రేలియాను కంగుతినిపించాలంటే.. అన్ని విభాగాల్లోనూ గొప్పగా రాణించాల్సి ఉంటుంది. అందుకే.. బంగ్లాతో మ్యాచ్‌ను సెమీస్ సన్నద్ధతగా భావిస్తున్న భారత్.. భారీ విజయంపై కన్నేసింది. అయితే.. ఆదివారం ముంబైకి వర్ష సూచన ఉంది. దాంతో.. మ్యాచ్ సాగడంపై సందేహాలు నెలకొన్నాయి.
డీవై పాటిల్ స్టేడియంలో గత మ్యాచ్ మాదిరిగానే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. కానీ, ఉదయం నుంచే ముంబైలో వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉండడమే కాకుండా 75 శాతం వాన పడేందుకు వీలుందని వెల్లడించింది. దాంతో.. మ్యాచ్ సాగుతుందా? లేదంటే డక్‌వర్త్ లూయిస్ (DLS) ప్రకారం కనీసం కొన్ని ఓవర్ల ఆట అయినా సాధ్యపడేనా? అనేది తెలియాల్సి ఉంది.
India’s route to the final has one mammoth obstacle in the way: Australia 😳 pic.twitter.com/RBhZxQnrlS
— ESPNcricinfo (@ESPNcricinfo) October 25, 2025
బంగ్లాదేశ్‌పై వన్డేల్లో మెరుగైన రికార్డే ఉంది టీమిండియాకు. ఇప్పటివరకూ 8 మ్యాచుల్లో ఆరింట భారత్ గెలుపొందగా.. ఒకటి టైగా ముగిసింది. 2023 ద్వైపాక్షిక సిరీస్‌లో ఒకేఒక మ్యాచ్‌లో బంగ్లా విజయం సాధించింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న ఆ జట్టును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు చివరి లీగ్ మ్యాచ్ కూడా రేపే. విశాఖపట్టణంలో రెండు టీమ్‌లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
What’s the story behind Renuka Singh Thakur’s famous poster? 🤔🎨
A fun peek into the dressing-room vibes where every success is celebrated 😊 – By @mihirlee_58
Get your #CWC25 tickets 🎟 now: https://t.co/vGzkkgwXt4#TeamIndia | #WomenInBlue | #INDvNZ pic.twitter.com/OC62jHFijD
— BCCI Women (@BCCIWomen) October 24, 2025