భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగబోయే టెస్టు సిరీస్‌లలో విజేతకు ఇచ్చే ట్రోఫీ పేరు ఇక నుంచి టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా మారనుంది. గతంలో దీనిని పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. భారత్, ఇంగ్లండ్ జట్ల తరఫున ఆడిన దివంగత మన్సూర్ అలీఖాన్ పటౌడీ గౌరవార్థం విజేతలకు ట్రోఫీని బహుకరించేవారు.
కానీ ఇటీవలే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆ పేరును తొలిగించింది. ఇక నుంచి దానిని టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా పిలువనున్నారు. ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డులకెక్కగా ఇంగ్లండ్ తరఫున ఏకంగా 188 టెస్టులాడి పేసర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (704)గా అండర్సన్‌కు పేరుంది.