Anderson – Tendulkar Trophy : భారత్, ఇంగ్లండ్ దిగ్గజాల పేరుతో నిర్వహించిన అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. 25 రోజుల సుదీర్ఘ సమయంలో ఇరుజట్ల ఆటగాళ్లు శతకాలతో రెచ్చిపోగా.. బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. మొదటిదైన లీడ్స్ టెస్టు(Leads Test)లో ఇంగ్లండ్ అద్భుత విజయం నుంచి.. ఓవల్ (Oval) మైదానంలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ వరకూ ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), రిషభ్ పంత్ (Rishabh Pant) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో చరిత్ర సృష్టించగా.. జో రూట్ (Joe Root) ఒకే ఒక ఇన్నింగ్స్‌తో ముగ్గురు దిగ్గజాల(రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్)ను దాటేశాడు. ఇక బౌలర్లు అయితే రికార్డు స్థాయిలో 1,860.4 ఓవర్లు వేశారు. మొత్తంగా రెండు జట్ల బ్యాటర్లు 6,736 పరుగులు బాదగా.. ఫీల్డర్లు అత్యధికంగా 41 క్యాచ్‌లను జారవిడిచారు.
England’s last series win against India came in 2018, when they won 4-1 at home 😳
🔗 https://t.co/KWBihl4i0S pic.twitter.com/PBd4v32mHJ
— ESPNcricinfo (@ESPNcricinfo) August 5, 2025
విదేశాల్లో చరిత్రాత్మక విజయాలు సాధిస్తున్న భారత జట్టు ఈసారి ఇంగ్లండ్ గడ్డ మీద పంజా విసిరింది. సీనియర్లు అశ్విన్, రోహిత్, కోహ్లీలు వీడ్కోలుతో దూరమైనా.. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడకున్నా సమిష్టి పోరుతో నవ చరిత్ర లిఖించింది. తొలి సిరీస్‌లోనే కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తనదైన ముద్రవేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు గిల్. అయితే.. టీమిండియా స్వల్ప పరుగుల (ఓవల్ టెస్టులో 6 పరుగుల విజయం) తేడాతో గెలుపొందడం ఇదే మొదటిసారి. 2004లో ఆస్ట్రేలియాపై వాంఖడేలో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది.
The umpires had a largely good series: Decisions were challenged 63 times this series by both sides, of which 44 were unsuccessful reviews ❌
More stats from the series: https://t.co/MImvMKMHfy | #ENGvIND pic.twitter.com/WgP7do32s5
— ESPNcricinfo (@ESPNcricinfo) August 5, 2025
ఈ సిరీస్‌లో ఆల్‌టైమ్ రికార్డు అంటే సిరాజ్(Siraj)దే. ప్రధాన పేసర్ బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ యూనిట్‌కు దళపతిగా వ్యవహరించిన మియా భాయ్ అత్యధిక వికెట్ల(23) వీరుడిగా నిలిచాడు. అలుపన్నదే తెలియదన్నట్టు ఐదు టెస్టులు ఆడిన సిరాజ్185.5 ఓవర్లు (1,113 బంతులు) బౌలింగ్ చేశాడు. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడీ హైదరాబాదీ. ఈ సిరీస్‌లో వెయ్యి బంతులు సంధించిన ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఐదు టెస్టుల సిరీస్‌లో ఆటగాళ్ల మాదిరిగానే అంపైర్లు కచ్చితమైన నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఇరుజట్లు అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 63 రివ్యూలు తీసుకున్నాయి. వీటిలో 44 వృథా అయ్యాయంటే ఫీల్డ్ అంపైర్లు ఎంత పక్కాగా ఉన్నారో అర్ధమవుతుంది. ఇందులో భారత జట్టు తీసుకున్న 24 రివ్యూస్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.
‘Everyone’s left a lot on the grounds for their countries’ 🗣️
Ben Stokes on those who put their bodies on the line this series #ENGvIND pic.twitter.com/SAZ1GG5Hds
— ESPNcricinfo (@ESPNcricinfo) August 5, 2025
ఒక సిరీస్‌లో సగటున అత్యధికంగా 700 ప్లస్ రన్స్ నమోదుకావడం ఇది రెండోసారి.
ఐదు టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు 14 పర్యాయాలు 300 ప్లస్ రన్స్ చేశాయి.
ఏకంగా తొమ్మిది మంది బ్యాటర్లు ఈ సిరీస్‌లో 400లకు పైగా స్కోర్ చేశారు.
పంతొమ్మిది పర్యాయాలు సెంచరీ భాగస్వామ్యాలు రికార్డు అయ్యాయి.
ఓవల్‌లో నాలుగో రోజు విజయంపై ఆశలు సన్నగిల్లినా.. ఐదో రోజు చిరస్మరణీయ విజయంతో సిరీస్ సమం చేసింది టీమిండియా. 374 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు హ్యారీ బ్రూక్, జో రూట్ల సెంచరీలతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. కానీ, ఐదో రోజు సిరాజ్ విజృంభణతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. అంతే.. అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ.. చరిత్రాత్మక విజయంతో సిరీస్‌ను సమం చేసింది గిల్ సేన.