World University Games | న్యూఢిల్లీ: ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. చైనా వేదికగా ముగిసిన ఈ క్రీడల్లో.. మన అథ్లెట్లు 26 పతకాలతో మెరిశారు. అందులో 11 స్వర్ణాలు, 5 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. యూనివర్సిటీ క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా.. గతంలో భారత్ అత్యధికంగా 21 పతకాలు సాధించింది.
దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ఈసారి 256 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అత్యధికంగా షూటింగ్లో 14 మెడల్స్ రాగా.. ఆర్చరీలో 7 మెడల్స్ దక్కాయి. 178 పతకాలతో ఆతిథ్య చైనా అగ్రస్థానంలో నిలిచింది.