లండన్ : ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ లండన్ అంచెలో భారత్ సత్తాచాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో భారత్.. 4-3తో దాయాది దేశాన్ని చిత్తుచేసింది.
భారత్ తరఫున అభిషేక్ (22వ నిమిషంలో), నీలకంఠ శర్మ (24), సుఖ్జీత్ సింగ్ (40), రాజిందర్ సింగ్ (53) తలా ఓ గోల్ చేశారు. పాకిస్థాన్ నుంచి అహ్మద్ నదీమ్ (8), అబు మహ్మద్ (53), మోయిన్ షకీల్ (60) పోరాడినా పాక్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు.