ముంబై: టీమ్ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై అనూహ్యంగా న్యూజిలాండ్‌కు సిరీస్‌కు సమర్పించుకున్న రోహిత్‌సేన..ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తున్నది. ఇందుకోసం గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా చెమటోడ్చారు. అంచనాలు, వ్యూహాలు బెడిసికొట్టిన వేళ తొలి రెండు టెస్టుల్లో ఓటమివైపు నిలిచిన టీమ్ఇండియా..వాంఖడేలో కివీస్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నది. గత రెండు మ్యాచ్‌ల్లో స్పిన్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న బ్యాటర్లపై కోచింగ్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. అస్టిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్..నెట్స్‌లో బ్యాటర్ల ఆటతీరును నిశితంగా పరిశీలించాడు.మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న వాంఖడే పిచ్ స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో కివీస్ కూడా తమ వ్యూహాలకు పదును పెట్టింది. సాంట్నర్..మరోమారు విజృంభిస్తే కివీస్ క్లీన్‌స్వీప్ లక్ష్యం నెరవేరినట్లే.