Asian Champions Trophy : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు(Inida Hockey Team) మరో టైటిల్ వేటను విజయంతో మొదలెట్టింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy)లో టీమిండియా బోణీ కొట్టింది. విశ్వ క్రీడల తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో పంజా విసిరింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ 3-0తో చైనాను చిత్తుగా ఓడించింది.
ఒలింపిక్ విజేతగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే గర్జించింది. ఆదివారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఆట ఆరంభంలో చైనా ఆటగాళ్లు కౌంటర్ అటాక్‌తో భయపెట్టారు. కానీ, భారత డిఫెన్స్ వాళ్లను సమర్థంగా అడ్డుకుంది. అభిషేక్ సింగ్ 5వ నిమిషంలోనే గోల్ కొట్టి ఆధిక్యాన్ని 1-0కు పెంచాడు.
India 🇮🇳 mark their return to action with handsome win over China 🇨🇳 in their opening fixture of Men’s Asian Champions Trophy 2024! 🏑
Sukhjeet Singh, Uttam Singh and Abhishek scored the goals for the Men in Blue.#HATC2024 #Hockey pic.twitter.com/E5s8EkT6eA
— Khel Now (@KhelNow) September 8, 2024
ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచలేకపోయాడు.అయితేనేమీ.. ఆ వెంటనే సుఖ్జీత్, ఉత్తమ్‌లు తలా ఒక గోల్ కొట్టడంతో భారత్ 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖర్లో చైనా ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు ఎంతో ప్రయత్నించారు. పెనాల్టీ కార్నర్లతో పరువ కాపాడుకోవాలని చూశారు. కానీ, భారత డిఫెన్స్ వాళ్ల ఎత్తులను చిత్తు చేసింది.
పీఆర్ శ్రీజేశ్(PR Sreejesh) వారసుడిగా గోల్ కీపర్‌గా ఎంపికైన సూరజ్ కర్కేరా(Suraj Karkera) తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. చైనా గోల్ ప్రయత్నాలను సమర్ధంగా అడ్డుకొని శెభాష్ అనిపించుకన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పెనాల్టీ కార్నర్‌ను నమ్ముకోకుండా ఏకంగా మూడు ఫీల్డ్ గోల్స్‌తో అదరహో అనిపించారు. తర్వాతి మ్యాచ్‌లో భారత జట్టు సెప్టెంబర్ 9న జపాన్‌తో తలపడనుంది.
సూరజ్ కర్కేరా