Olympic Qualifiers | ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో బోణీ.. ఇంకొకటి గెలిస్తే నాకౌట్‌కు టీమిండియా
Olympic Qualifiers : హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో భారత మహిళల జట్టు(Indian Womens Team) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో కంగుతిన్న సవితా పూనియా(Savita Punia) బృందం న్యూజిలాండ్(Newzealand)పై ఘన విజయం..
Olympic Qualifiers : హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో భారత మహిళల జట్టు(Indian Womens Team) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో కంగుతిన్న సవితా పూనియా(Savita Punia) బృందం న్యూజిలాండ్(Newzealand)పై ఘన విజయం సాధించింది. పూల్ బిలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో కివీస్‌ను 3-1తో ఓడించింది. భారత్ జనవరి 16న జరిగే మ్యాచ్‌లో బలమైన ఇటలీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచిందంటే నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది.
‘కీలక మ్యాచ్‌లో గెలిచినందుకు సంతోషంగా ఉంది. జట్టుతో కనెన్ట్ అయి ఉండాలనేది తొలి మ్యాచ్‌తో అర్థమైంది. దాంతో, ఈరోజు మేమేంటో చూపించాం. ఈ విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడినా, టైగా ముగించినా ఉపయోగం లేదని మాకు తెలుసు. అందుకనే కసిగా ఆడాం. మా డిఫెండర్లను దాటి గోల్ కొట్టడం ఏ జట్టుకైనా కష్టమే’ అని భారత జట్టు కోచ్ జన్నెకె స్కాప్‌మన్(Janneke Schopman) తెలిపింది.
🇮🇳India roars back after the defeat against USA with a comprehensive victory over New Zealand in their 2️⃣nd pool match at the Hockey Olympic Qualifying tournament in Jharkhand! ✨🙌#FIHOlympicQualifiers pic.twitter.com/4pLDMjFqMw
— The Bridge (@the_bridge_in) January 14, 2024
ఆరంభ పోరులో అమెరికా చేతిలో పరాజయం నుంచి తేరుకున్న టీమిండియా ఆదివారం గర్జించింది. మ్యాచ్ మొదలైన నిమిషానికే న్యూజిలాండ్ గోల్ పోస్ట్‌పై దాడి చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత లర్లెమ్సియామీ(Larlemsiami) పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. ఆ కాసేపటికే బర్త్ డే గర్ల్ ఉదితా (Udita) మరో పెనాల్టీ కార్నర్‌ను స్నాప్ షాట్ ద్వారా గోల్‌గా మలిచింది. తొలి అర్థ భాగంలోనే 3-1తో మ్యాచ్‌పై పైచేయి సాధించిన భారత్ రెండో అర్థ భాగంలో ప్రత్యర్థికి ఒక్క చాన్స్ ఇవ్వలేదు. ఇరుజట్లు ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కొట్ట లేకపోయాయి.
ఇవి కూడా చదవండి
- Telangana | అన్నదాతల బతుకు ఆగమాయె
- Sobhita Dhulipala | వైట్ కలర్ శారీలో కవ్విస్తున్న శోభితా ధూళిపాళ..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

