అహ్మదాబాద్ : విండీస్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టు(India Vs West Indies)లో టీమిండియా ట్విస్ట్ ఇచ్చింది. ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 5 వికెట్ల నష్టానికి 448 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. అయితే మూడో రోజు ఉదయం అనుకున్నట్లుగా ఇండియా బ్యాటింగ్‌కు దిగలేదు. తొలి ఇన్నింగ్స్‌ను గిల్ సేన డిక్లేర్ చేసింది. అహ్మదాబాద్ పిచ్‌పై స్పిన్ ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో ఇండియా అకస్మాత్తుగా డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ఓపెనర్లు క్యాంప్‌బెల్, చంద్రపాల్ బ్యాటింగ్ చేస్తున్నారు.
Update: #TeamIndia have declared their innings on an overnight score of 448-5 with a lead of 286 runs.
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/t4cj1FCgAt
— BCCI (@BCCI) October 4, 2025