వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న రోహిత్ సేన మరో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో విజయ ఢంకా మోగించి 3-0తో ట్రోఫీ కైవసం చేసుకుంది. మూడేండ్ల తర్వాత హిట్‌మ్యాన్ మూడంకెల స్కోరు అందుకోగా.. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో శుభ్‌మన్ మూడో సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. కొండంత లక్ష్యఛేదనలో కాన్వే శతకంతో పోరాడే ప్రయత్నం చేసినా.. శార్దూల్, కుల్దీప్ చెరో మూడు వికెట్లతో భారత్ విజయం ఖాయం చేశారు. ఈ దెబ్బతో త్వరలో విడుదల కానున్న ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా అధికారికంగా అగ్రస్థానానికి చేరనుంది!
ఇండోర్: సొంతగడ్డపై టీమ్ఇండియా మరో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇటీవల శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన రోహిత్ సేన.. న్యూజిలాండ్‌పైనా అదే జోరు కొనసాగిస్తూ.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో హస్తగతం చేసుకుంది. మంగళవారం ఇండోర్‌లో జరిగిన నామమాత్రమైన ఆఖరి వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. ఫుల్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మరో శతకం ఖాతాలో వేసుకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (36) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. శార్దూల్ ఠాకూర్ (25) విలువైన పరుగులు జోడించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్, టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 రన్స్‌కు ఆలౌటైంది. కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో పోరాడగా.. నికోల్స్ (42), శాంట్నర్ (34) అతడికి సహకరించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. శార్దూల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి. వన్డే సిరీస్‌లో విజయం సాధించిన టీమ్ఇండియా.. శుక్రవారం రాంచీలో న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది.
26 ఓవర్లలో 212/0
బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఇండోర్ పిచ్‌పై టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. మూడేండ్లుగా అంతర్జాతీయ శతకం నమోదు చేయని హిట్‌మ్యాన్ రోహిత్.. ఆరంభం నుంచి మంచి షాట్లతో అలరించగా.. గిల్ సూపర్ ఫామ్ కొనసాగించాడు. ఔట్ ఫీల్డ్ వేగంగా ఉండటంతో భారీ షాట్లతో విరుచుకుపడ్డ ఈ జంట ఒకే ఓవర్లో సెంచరీలు పూర్తి చేసుకుంది. ఓపెనర్లు దంచుడుతో హోల్కర్ స్టేడియం హోరెత్తింది. వీరి జోరు చూస్తుంటే.. టీమ్ఇండియా మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా.. క్రీజులో నిలదొక్కుకున్న ఓపెనర్లు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడం దెబ్బ కొట్టింది. సమన్వయ లోపంతో ఇషాన్ రనౌట్ కాగా.. మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ క్యాచౌటయ్యాడు.
రెండు సిక్సర్లతో అలరించిన సూర్యకుమార్ తప్పుడు షాట్‌కు మూల్యం చెల్లించుకోగా.. లోయర్ ఆర్డర్‌తో కలిసి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఆరంభంలో స్ట్రయిక్ రొటేషన్‌కే పరిమితమైన ఈ ఆల్‌రౌండర్ చివరి ఓవర్లలో ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అతడికి శార్దూల్ ఠాకూర్ నుంచి చక్కటి సహకారం లభించింది.గత మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన న్యూజిలాండ్.. ఇండోర్‌లో కాస్త పోరాడింది. కొండంత లక్ష్యం కండ్ల ముందు కనిపిస్తున్న అదరక బెదరక ఎదురు నిలిచే ప్రయత్నం చేసింది. అయితే మనవాళ్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో కివీస్‌కు వైట్‌వాష్ తప్పలేదు. న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం టీమ్ఇండియాకు ఇది మూడోసారి కావడం విశేషం.
వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీల
జాబితాలో రోహిత్ మూడో స్థానానికి చేరాడు. సచిన్ టెండూల్కర్ (49), విరాట్ కోహ్లీ (46) తొలి ప్లేస్ల్లో ఉండగా.. పాంటింగ్‌తో కలిసి రోహిత్ (30) మూడో ప్లేస్‌లో నిలిచాడు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ (360), బాబర్ ఆజమ్ (360; 2016లో వెస్టిండీస్‌పై)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇది (385/9) రెండో అత్యధిక స్కోరు. 2009 క్రైస్ట్‌చర్చ్‌లో చేసిన 392/4.. అగ్రస్థానంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో భారత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య. వన్డేల్లో టీమ్ఇండియాకు ఇదే అత్యధికం. 2013లో ఆస్ట్రేలియాపై కూడా భారత్ 19 సిక్సర్లే కొట్టింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ ఒక్కడే 16 సిక్సర్లు బాదాడు
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 385/9 (గిల్ 112, రోహిత్ 101; జాకబ్ 3/100, టిక్నర్ 3/76), న్యూజిలాండ్: 41.2 ఓవర్లలో 295 ఆలౌట్ (కాన్వే 138, నికోల్స్ 42; శార్దూల్ 3/45, కుల్దీప్ 3/62).