కొలంబో: సాఫ్ అండర్-17 చాంపియన్‌షిప్‌లో భారత్ ఏడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 4-1(పెనాల్టీ షూటౌట్) తేడాతో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత సమయంలో ఇరు జట్ల మధ్య స్కోరు 2-2తో సమమైంది.
చివరి నిమిషం నువ్వానేనా అన్నట్లు సాగిన తుదిపోరులో భారత్ తరఫున దల్లామన్ గాంగ్టె(4ని), అజ్లాన్‌షా(38ని) గోల్స్ చేశారు. అయితే ఆఖరి నిమిషంలో బంగ్లా గోల్‌తో స్కోరు సమం కావడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.