యువ భారత్ డబుల్ హ్యాట్రిక్
చైనాలో జరిగిన ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రెండు టీమ్‌లూ.. ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులను చిత్తు చేసి హ్యాట్రిక్ టైటిల్‌తో సత్తాచాటాయి. పురుషుల విభాగంలో భారత్.. 4-1తో సౌత్కొరియాను ఓడించి గోల్డ్ మెడల్ కొట్టింది.
- పురుషుల, మహిళల హాకీ జట్లకు టైటిళ్లు
- జూనియర్ ఆసియా కప్
మోఖి: చైనాలో జరిగిన ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రెండు టీమ్‌లూ.. ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులను చిత్తు చేసి హ్యాట్రిక్ టైటిల్‌తో సత్తాచాటాయి. పురుషుల విభాగంలో భారత్.. 4-1తో సౌత్కొరియాను ఓడించి గోల్డ్ మెడల్ కొట్టింది.
భారత్ తరఫున అజీత్ యాదవ్ (9వ నిమిషంలో), కెప్టెన్ అన్మోల్ ఎక్కా (13వ), ప్రభ్‌దీప్ సింగ్ (21వ), అషు మౌర్య (50వ) తలా గోల్ కొట్టి జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. సౌత్‌కొరియా తరఫున నాలుగో క్వార్టర్లో లీ మిన్హ్యోక్ (54వ) ఒక గోల్ చేశాడు. ఈ టోర్నీలో అబ్బాయిలకు ఇది వరుసగా నాలుగో టైటిల్ కాగా మొత్తంగా ఆరో (2004, 2008, 2015, 2023, 2024, 2026)వది కావడం విశేషం.
చైనాను నిలువరించి..
మహిళల కేటగిరీలో భారత్.. 1-0తో ఆతిథ్య చైనాను ఓడించి పసిడి పతకాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో సానిక చంద్రకాంత్ మనె 17వ నిమిషంలో గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చింది. తర్వాత భారత్ గోల్ కొట్టకపోయినా ఆరంభం నుంచే పదే పదే గోల్స్ కోసం యత్నించిన చైనాను విజయవంతంగా నిలువరించింది. తాజా విజయాలతో భారత మెన్స్, విమెన్స్ టీమ్స్ వచ్చే ఏడాది జరుగబోయే ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్‌నకు అర్హత సాధించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

