ముంబై: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), రైజింగ్ స్టార్ యశస్వి జైస్వాల్.. ముంబై రంజీ జట్టుకు ఆడనున్నారు. రంజీ టోర్నీలో భాగంగా జవనరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరగనున్న మ్యాచ్‌కు .. ముంబై క్రికెట్ సంఘం జట్టు సభ్యులను ప్రకటించింది. ఆ బృందంలో రోహిత్, జైస్వాల్ ఉన్నారు. అజింక్య రహానే సారథ్యంలో ముంబై జట్టు మ్యాచ్ ఆడనున్నది. రంజీ ట్రోఫీలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల రోహిత్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్‌లో రోహిత్ సరైన రీతిలో పర్ఫార్మ్ చేయలేదు. దీంతో అతను చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. అయితే శనివారం చాంపియన్స్ ట్రోఫీకి చెందిన జట్టును ప్రకటించారు. సీటీ టోర్నీ కోసం రోహిత్ పగ్గాలు చేపట్టనున్నాడు. ఆసీస్ టూర్లో పేలవ ప్రదర్శన కారణంగా.. ప్లేయర్లు స్వదేశీ క్రికెట్లో ఆడాలంటూ బీసీసీఐ ఓ నిబంధన కూడా పెట్టిన విషయం తెలిసిందే. గత ఆరేడేళ్ల నుంచి రెగ్యులర్‌గా టెస్టు క్రికెట్ ఆడడం వల్ల.. స్వదేశీ టోర్నీలో ఆడే అవకాశం లేకుండాపోయిందని ఇటీవల రోహిత్ పేర్కొన్నాడు.
ముంబై జట్టు:
అజింక్య రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మాత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్దేశ్ లాడ్, శివం దూబే, హార్ధిక్ తామోర్(వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్, తనుష్ కొటియాన్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవాస్తీ, సిల్వస్టర్ డిసౌజా, రోస్టన్ డయాస్, కర్ష్ కొఠారి.